CEO Telangana: సెలబ్రిటీకి బదులుగా ట్రాన్స్‌జెండర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక

CEO Telangana Select Transgender For Their Brand Ambassador
  • తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసిన తెలంగాణ ఎన్నికల కమిషన్
  • వరంగల్‌కు చెందిన లైలాతో ఓటుహక్కు, మార్పులు చేర్పులపై ప్రచారం
  • 3,600 మందికిపైగా ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం
తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఈసారి ట్రాన్స్‌‌జెండర్‌ ఎంపికయ్యారు. సాధారణంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఓటు హక్కుపై అవగాహన వంటివాటిపై ప్రచారం కోసం ఎన్నికల కమిషన్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. అయితే, తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసింది.

వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమెతో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒకరోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను లైలా ఏర్పాటు చేయించారు.

CEO Telangana
Transgender
Voter
Voter Helpline
Telangana

More Telugu News