PM Modi: వాట్సాప్ 'చానల్స్' లో ఎంట్రీ ఇచ్చిన ప్రధాని మోదీ

PM Modi enters into Whatsapp Channels

  • 'చానల్స్' పేరుతో ఇటీవలే కొత్త ఫీచర్ తీసుకువచ్చిన వాట్సాప్
  • చానల్స్ క్రియేటర్లు పెట్టే పోస్టులు వాట్సాప్ యూజర్లందరూ చూసే వీలు
  • కొత్త పార్లమెంటు భవనాన్ని తొలి పోస్టుగా పెట్టిన ప్రధాని మోదీ

ప్రముఖ సోషల్ మెసేజింగ్ సైట్ వాట్సాప్ ఇటీవల 'చానల్స్' అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లో కొత్తగా ప్రవేశపెట్టిన 'అప్ డేట్స్' అనే ట్యాబ్ లో ఈ 'చానల్స్' అనే ఫీచర్ కనిపిస్తుంది. ఇది వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ వంటిది. 

వాట్సాప్ లో ఓ చానల్ ను క్రియేట్ చేసుకున్న అడ్మిన్లు రెగ్యులర్ గా అప్ డేట్లు పంచుకునే వీలుంటుంది. టెక్ట్స్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు పంపించడమే కాదు, ఒపీనియన్ పోల్స్ కూడా నిర్వహించవచ్చు. వాట్సాప్ చానల్ ను కలిగివున్న ఎవరైనా ఒక పోస్టు  పెడితే వాట్సాప్ యూజర్లందరూ దాన్ని చూసే వీలుంటుంది. ఒకరకంగా ఇది ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటిదే. 

ఇప్పుడీ వాట్సాప్ 'చానల్స్' లోకి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రవేశించారు. వాట్సాప్ 'చానల్స్' లో తన తొలి పోస్టుగా నూతన పార్లమెంటు భవనం ఫొటోను పంచుకున్నారు. వాట్సాప్ 'చానల్స్' కమ్యూనిటీలో చేరడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని మోదీ వెల్లడించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు, వారితో ముఖాముఖి కొనసాగించేందుకు ఇది మంచి వేదిక అని పేర్కొన్నారు.

PM Modi
Channels
Whatsapp
New Parliament Building
  • Loading...

More Telugu News