Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Judgement reserved on Chandrababu quash petition

  • మధ్యాహ్నం గం.12 నుంచి సాయంత్రం గం.5 వరకు సుదీర్ఘ వాదనలు
  • లంచ్ బ్రేక్‌కు ముందు వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
  • మధ్యాహ్నం తర్వాత వాదనలు వినిపించిన సీఐడీ తరఫు న్యాయవాది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం గం.12. నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే లంచ్ బ్రేక్ వరకు వాదనలు వినిపించారు. ఆ తర్వాత రెండున్నర గంటల తర్వాత నుంచి సాయంత్రం ఐదు వరకు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

సీఐడీ తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, సీఐడీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తోందని వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహాత్గీ  వర్చువల్ పద్ధతిలో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, రెండున్నరేళ్ల పాటు పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

Chandrababu
Andhra Pradesh
Telugudesam
AP High Court
  • Loading...

More Telugu News