Allu Arjun: అల్లు అర్జున్ కు ప్రత్యేక గౌరవం!.. లండన్ లో మైనపు విగ్రహం
![Allu Arjun to get a wax statue at Madame Tussauds in London](https://imgd.ap7am.com/thumbnail/cr-20230919tn65096210c3924.jpg)
- వచ్చే ఏడాది ఏర్పాటు చేయనున్న లండన్ మ్యూజియం
- కొలతలు ఇవ్వడానికి వెళ్లనున్న అల్లు అర్జున్
- దక్షిణాది నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు, గౌరవానికి నోచుకోనున్నాడు. తన నటనతో బన్నీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడు. ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం.