Nara Lokesh: టీడీపీ నేతలు గుడికి వెళుతుంటే అరెస్టులా?: నారా లోకేశ్

YSRCP govt is arresting TDP leaders who are going to temples says Nara Lokesh

  • జగన్ పాపం పండిందన్న నారా లోకేశ్
  • విదేశాల్లో కూడా వస్తున్న మద్దతు చంద్రబాబు సత్తాకు నిదర్శనమని వ్యాఖ్య
  • అరెస్టులు, నిర్బంధాలతో బాబుకు వస్తున్న మద్దతును అడ్డుకోలేరన్న యువనేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూసి వైసీపీ ప్రభుత్వం వణికిపోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రభుత్వ కుట్రలు విఫలం కావాలని....అధినేతకు మంచి జరగాలని దేవాలయాల్లో పూజలకు వెళుతున్న వారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడికి వెళుతుంటే కూడా అర్థం లేని నిబంధనలతో అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనమని అన్నారు. జగన్ పాపం పండిందని....వైసీపీ ప్రభుత్వానికి మూడిందని చెప్పారు. టీడీపీ నేతలు, ప్రజలు గుడికి వెళ్లాలో వద్దో కూడా జగన్ నిర్దేశిస్తారా? అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలతో నిరసనలను, చంద్రబాబుకు వస్తున్న మద్దతును అడ్డుకోలేరని అన్నారు.

చంద్రబాబు అరెస్టుపై దేశ, విదేశాల్లో సైతం వెల్లువెత్తుతున్న నిరసనలు ఆయన పాలనకు, ప్రజాసేవకు నేడు అద్దం పడుతున్నాయని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరససిస్తూ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దీక్షలు, నిరసనలు, ర్యాలీలు ఆయన నిష్కళంక చరిత్రను చాటి చెబుతున్నాయని చెప్పారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో, ఇతర దేశాల్లోని అనేక నగరాల్లో జరగుతున్న మద్దతు ర్యాలీలు... 45 ఏళ్లగా చంద్రబాబు చేసిన అభివృద్ధి రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 

ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో నిరసనలు జరిగిన సందర్భం, ఇంత స్థాయిలో స్పందన వచ్చిన ఘటన మరొకటి లేదని చెప్పారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలోని బళ్లారిలో అభిమానులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలపడంపై లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేని వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి మద్ధతు ప్రకటించడం తమకు ఎంతో ధైర్యాన్నిస్తోందని...వారందరికీ తమ కుటుంబం నుంచి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. చంద్రబాబు పాలసీల కారణంగా లబ్ధి పొందిన వర్గాలు నేడు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నాయని....ఇదీ చంద్రబాబు క్రెడిబిలిటీ అంటే అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News