Naga Chaitanya: శోభితతో నాగచైతన్య రెండో పెళ్లి.. ఇండియా టుడేలో ఆసక్తికర కథనం!

Naga Chaitanya second marriage with Sobhita Dhulipala

  • కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్
  • తమ రిలేషన్ షిప్ ను గురించి ఇద్దరూ త్వరలోనే బహిరంగ ప్రకటన చేయనున్నారంటూ ఇండియా టుడే కథనం
  • సినీ పరిశ్రమకు వెలుపలి వ్యక్తిని నాగచైతన్య చేసుకోబోవడం లేదని వెల్లడి

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, అక్కినేని నాగచైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి... ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. తన సినిమా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకున్న సమంత... తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. అమెరికాలో చికిత్స తీసుకుంటోంది. మరోవైపు, నాగచైతన్య తన తాజా సినిమాలపై ఫోకస్ చేశాడు. మరోవైపు సినీ నటి శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు, వీరి ప్రేమాయణం గురించి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. తమ రిలేషన్ షిప్ ను వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా బహిర్గతం చేయనున్నారని... రిలేషన్ షిప్ పై ప్రకటన గురించి ఇద్దరూ ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చారని ఇండియా టుడే తెలిపింది. వీరికి అత్యంత సన్నిహితమైన వర్గాల నుంచి ఈ సమాచారం అందిందని పేర్కొంది. 

'ఒక వ్యాపారవేత్త కుమార్తెను నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ఇటీవలి కాలంలో మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వారి సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. సినీ పరిశ్రమకు వెలుపలి వ్యక్తిని నాగచైతన్య పెళ్లి చేసుకోవడం లేదు. శోభితతో నాగచైతన్య ఇప్పటికీ డేటింగ్ లో ఉన్నాడు. వారి బంధం మరింత బలపడుతోంది. త్వరలోనే వారి రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించే విషయమై వారు చర్చించారు. వారి ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు వారు సిగ్గు పడటం లేదు' ఇండియా టుడే తెలిపింది. ఈ కథనం ప్రకారం.. నాగచైతన్య, శోభిత ఇద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే విషయం అర్థమవుతోంది.

Naga Chaitanya
Sobhita Dhulipala
Tollywood
Bollywood
Second Marriage
Samantha
  • Loading...

More Telugu News