Nara Lokesh: రాజ్ ఘాట్ వద్ద లోకేశ్ సహా టీడీపీ నేతల నివాళి.. మౌనదీక్ష..వీడియో ఇదిగో!

TDP leaders deeksha at Raj Ghat

  • మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించిన టీడీపీ నేతలు
  • కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్, ఎంపీలు, కీలక నేతలు
  • నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళి

ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మాగాంధీ సమాధికి టీడీపీ నేతలు ఈ ఉదయం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ సహా ఆ పార్టీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే కూర్చుని మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పొల్గొన్నారు. రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... న్యాయస్థానంలో ఈ రోజు చంద్రబాబు పిటిషన్లు విచారణకు వస్తున్నాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఎలాంటి అవినీతి చేయని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద తాము నివాళి అర్పించే పరిస్థితిని సీఎం జగన్ తీసుకొచ్ఛారని మండిపడ్డారు. 
 

Nara Lokesh
Telugudesam
Raj Ghat
Delhi
  • Loading...

More Telugu News