Bandla Ganesh: వినాయకచవితి జరుపుకోలేదు.. తిండి కూడా తినాలనిపించడం లేదు: బండ్ల గణేశ్

Not celebrated Vinayaka Chavithi due to pain of Chandrababu arrest says Bandla Ganesh

  • చంద్రబాబు అరెస్ట్ ఎంతో బాధించిందన్న బండ్ల గణేశ్
  • జాతీయ సంపద అయిన చంద్రబాబును కాపాడుకోవాలని విన్నపం
  • అందరూ సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని సూచన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్ అక్రమమంటూ ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అధినేతలు విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అంశం పార్లమెంటులో సైతం ప్రస్తావనకు వచ్చింది. తాజాగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందిస్తూ... చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాను తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని తెలిపారు. 

ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని... ఐటీ ఉద్యోగులు  నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా... సొంతూళ్లలో బొడ్రాయి ముందు కూర్చోని ధర్నాలు చేయాలని సూచించారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే... తనకు ఆహారం కూడా తీసుకోవాలనిపించడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News