TDP: టీడీపీ ఎంపీ రామ్మోహన్ పై లోక్ సభలో మిథున్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు... వీడియో ఇదిగో!

Mithun Reddy comments on Rammohan Naidu

  • నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
  • లోక్ సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ
  • మిథున్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను పంచుకున్న టీడీపీ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా, లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో పరస్పర విమర్శల దాడి జరిగింది. అయితే, తమ ఎంపీ రామ్మోహన్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో  పంచుకుంది. మిథున్ రెడ్డి మాట్లాడుతుండగా, రామ్మోహన్ అభ్యంతరం చెప్పడం... రేయ్ కూర్చోరా, మాట్లాడింది చాలు, రేయ్ కూర్చోరా బాబూ అంటూ మిథున్ రెడ్డి తీవ్ర పదజాలం ఉపయోగించడం ఆ వీడియోలో చూడొచ్చు. 

దీనిపై టీడీపీ స్పందిస్తూ... బీసీలు అంటే ఈ సైకో పార్టీకి ఎంత చులకన? అంటూ మండిపడింది. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో మిథున్ రెడ్డి లోక్ సభలో కూడా అబద్ధాలు చెబుతుంటే రామ్మోహన్ నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడని వెల్లడించింది. కానీ, మిథున్ రెడ్డి అరేయ్, ఒరేయ్, నువ్వు నాకు చెప్పేదేంట్రా అంటూ రెచ్చిపోయాడని ఆరోపించింది.

TDP
Kinjarapu Ram Mohan Naidu
Mithun Reddy
Lok Sabha
YSRCP

More Telugu News