Klin Kaara: అమ్మమ్మ గారింట మూడు నెలలు గడిపి కొణిదెల వారింటికి చేరుకున్న క్లీంకార

- జూన్ 20న అమ్మాయికి జన్మనిచ్చిన ఉపాసన
- పాపకు క్లీంకార అని నామకరణం
- సొంతింట్లో క్లీంకారకు వేదమంత్రాలతో ఘనస్వాగతం
- మనవరాలిని చూసి చిరంజీవి, సురేఖ సంతోషం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లీంకార సొంతింటికి చేరుకుంది. ఉపాసన జూన్ 20న పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ పాపకు ఎంతో విశిష్టతతో కూడిన క్లీంకార అనే పేరు పెట్టారు.
ఇన్నాళ్లు అమ్మమ్మ శోభన కామినేని, తాతయ్య అనిల్ కామినేనిల ఇంట గడిపిన క్లీంకార... 3 నెలల తర్వాత కొణిదెల ఇంటికి చేరుకుంది. ఆ చిన్నారి చిరంజీవి ఇంట అడుగుపెట్టే సమయంలో చినజీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేద విద్యార్థులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేశారు. దాంతో చిరు నివాసంలో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళించాయి. అదే సమయంలో వినాయక విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు.
తమ ఇంటి కలల పంట క్లీంకారకు మెగా కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. చిరంజీవి, సురేఖ ముద్దుల మనవరాలిని చూసి సంబరపడిపోయారు.
