Chandrababu: చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత... నిబంధనల ప్రకారమే సౌకర్యాలు: జైళ్ళ శాఖ డీఐజీ

DIG about Chandrababu naidu security in rajahmundry jail

  • కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచామని వెల్లడి
  • తాను చట్ట ప్రకారమే పని చేస్తున్నానన్న జైళ్ళ శాఖ డీఐజీ
  • నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ఉంటాయని స్పష్టీకరణ

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ, రాజమండ్రి జైలు ఇన్చార్జి సూపరింటిండెంట్ రవికిరణ్ స్పందించారు. జైలు సూపరింటిండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడంతో రవికిరణ్ రాజమండ్రి జైలు ఇనార్జిగా వ్యవహరిస్తున్నారు. 

ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రికి పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఆయనకు నిబంధనల ప్రకారం సౌకర్యాలు ఉన్నాయని, కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచినట్లు చెప్పారు. తానూ చట్టప్రకారమే పని చేస్తున్నానని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని కోరారు. నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ఉంటాయన్నారు. వారానికి రెండు ములాఖత్‌లు ఉంటాయని, అత్యవసరమైతే మరో ములాఖత్‌పై జైలు అధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు. 

అవాస్తవాలు: సీఐడీ చీఫ్ సంజయ్

చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. పక్కా ఆధారాలతోనే దర్యాఫ్తు సంస్థ అరెస్ట్ చేసిందన్నారు. రూ.371 కోట్ల నిధుల్లో గోల్ మాల్ జరిగిందని కేంద్ర దర్యాఫ్తు సంస్థలు గుర్తించాయన్నారు. నగదు ట్రాన్సాక్షన్స్ విషయంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందన్నారు. చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాలన్నారు. ఈ కేసుకు సంబంధించి పెండ్యాల శ్రీనివాస్‌ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News