Keerthy Suresh: యువ సంగీత దర్శకుడితో కీర్తి సురేశ్ పెళ్లి అంటూ కథనాలు... ఖండించిన కీర్తి సురేశ్ తండ్రి

Marriage rumors on Keerthy Suresh

  • అనిరుధ్ రవిచందర్ తో కీర్తి సురేశ్ పెళ్లి అంటూ ప్రచారం
  • గతంలోనూ ఇలాంటి కథనాలు... ఖండించిన కీర్తి
  • తమ కుటుంబంలో అశాంతి కలిగించవద్దన్న కీర్తి తండ్రి

ప్రముఖ నటి కీర్తి సురేశ్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా టాక్ వినపడుతోంది. గత కొన్నిరోజులుగా ఇద్దరికీ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. 

కీర్తి సురేశ్ తమిళంలో నటించిన రెమో చిత్రంతో పాటు తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రానికి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాల సందర్భంగానే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా మారినట్టు తెలుస్తోంది. అయితే, ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ గతంలోనూ కథనాలు వచ్చాయి. వాటిపై కీర్తి సురేశ్ స్పందించి... అనిరుధ్ తనకు మంచి స్నేహితుడు అని వెల్లడించింది. 

అయితే ఈసారి ఏకంగా "ఇతడితోనే పెళ్లి" అంటూ కథనాలు రావడంతో కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ స్పందించారు. పెళ్లి అనేది చాలా సున్నితమైన అంశం అని, ఇలాంటి విషయాలపై పుకార్లు తీసుకువరావడం మంచిది కాదని హితవు పలికారు. కీర్తికి పెళ్లి కుదిరితే మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం కదా అని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో తమ కుటుంబంలో అశాంతి కలిగించవద్దని స్పష్టం చేశారు.

Keerthy Suresh
Rumors
Marriage
Anirudh Ravichandar
Suresh Kumar
Kollywood
Tollywood
  • Loading...

More Telugu News