Team India: ఆసియా కప్ ఫైనల్లో టాస్ ఓడిన భారత్

Team India loses toss in Asia Cup final

  • కొలంబోలో ఆసియా కప్ టైటిల్ సమరం
  • భారత్ వర్సెస్ శ్రీలంక
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఆసియా కప్-2023 ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ టైటిల్ సమరానికి వేదికగా నిలుస్తోంది. ఈ అంతిమ పోరులో ఆతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. 

బంగ్లాదేశ్ తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక లంక జట్టులోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన స్పిన్నర్ మహీశ్ తీక్షణ స్థానంలో దుషాన్ హేమంత జట్టులోకి వచ్చాడు.

Team India
Toss
Sri Lanka
Batting
Final
Asia Cup
Colombo
  • Loading...

More Telugu News