ram: ఊర్వశీ రౌతేలా మరో ఐటమ్ సాంగ్.. ఈసారి రామ్‌తో ‘కల్ట్ మామా’ స్టెప్పులు

Cult Mama lyrical song from tomorrow

  • పోతినేని రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్కంద’ చిత్రం
  • రేపు విడుదల కానున్న ‘కల్ట్ మామా’ అనే ఐటమ్ సాంగ్
  • ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా

వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటతో టాలీవుడ్‌కు చేరువైంది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. ఆ పాట హిట్ అవ్వడంతో ఆమెకు తెలుగులో వరుసగా ఐటమ్ సాంగ్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యే ‘బ్రో’ సినిమాలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నర్తించిన ఊర్వశీ ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్‌తో హుషారైన స్టెప్పులు వేసింది. రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘స్కంద’ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం ‘కల్ట్ మామా’ అంటూ సాగే నాలుగో పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. సినిమాలో ఇదొక స్పెషల్ సాంగ్‌. ఈ మాస్ పాటకు తమన్ తనదైన శైలిలో బాణీలు అందించగా రామ్, ఊర్వశీ హుషారుగా స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 28న విడుదల కానుంది.

ram
Boyapati Sreenu
urvashi rautela
special song
skanda
  • Loading...

More Telugu News