PV Sindhu: హైదరాబాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన బ్యాడ్మింటన్ తార పీవీ సింధు

PV Sindhu met Amit Shah in Hyderabad

  • రేపు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ
  • హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • సింధు ప్రతిభ దేశానికే గర్వకారణమన్న కేంద్ర హోంమంత్రి

బ్యాడ్మింటన్ తార పీవీ సింధు క్రీడా ప్రతిభ దేశానికే గర్వకారణం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. సింధు నిబద్ధత, కఠోర శ్రమ దేశ యువతకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. బీజేపీ రేపు (సెప్టెంబరు 17) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను పీవీ సింధు కలిశారు. అమిత్ షాకు పుష్పగుచ్ఛం అందించారు. కెరీర్ లో మరింత విజయవంతం అవ్వాలంటూ అమిత్ షా... సింధుకు ఆశీస్సులు అందించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, సింధు తండ్రి వెంకటరమణ కూడా పాల్గొన్నారు. 

PV Sindhu
Amit Shah
Hyderabad
Badminton
BJP
Telangana
  • Loading...

More Telugu News