Game Changer: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' పాట లీక్... క్రిమినల్ కేసు నమోదు

Song from Ram Charan Game Changer leaked as case filed

  • రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్
  • పాట లీక్ అయినట్టు గుర్తించిన చిత్రబృందం
  • హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా కంటెంట్ ఆన్ లైన్ లో లీకైనట్టు చిత్రబృందం గుర్తించింది. దీనిపై తాము ఫిర్యాదు చేశామని, హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని గేమ్ చేంజర్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. 

ఐపీసీ 66 (సి) కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని, గేమ్ చేంజర్ పాటను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ కంటెంట్ ను అక్రమంగా బయటకు విడుదల చేశారని, ఏమాత్రం నాణ్యత లేని ఆ కంటెంట్ ను మరింత వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. కాగా, గేమ్ చేంజర్ చిత్రంలోని 'జరగండి జరగండి' అనే పాట ఆన్ లైన్ లో లీక్ అయినట్టుగా కేసు నమోదు పత్రాల్లో పేర్కొన్నారు. 

Game Changer
Song
Leak
Case
Hyderabad
Ram Charan
Shankar
Dil Raju
Tollywood
  • Loading...

More Telugu News