Harish Rao: జగ్గారెడ్డి అడ్రస్ లేడు.. ఎక్కడున్నాడో తెలియదు: హరీశ్ రావు

Where is Jagga Reddy asks Harish Rao

  • జగ్గారెడ్డి ఫోన్ నెంబర్ నియోజకవర్గ ప్రజలకు తెలియదని హరీశ్ విమర్శ
  • 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేడని, ఎక్కడున్నాడో కూడా తెలియదని అన్నారు. ఆయన ఫోన్ నంబర్ ఏంటో నియోజకవర్గం ప్రజలకు తెలియదని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గొప్పలు చెప్పుకుంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ది చేతల ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ పక్కా హిందువు అయినప్పటికీ... మతాలకు అతీతంగా పని చేస్తారని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

Harish Rao
KCR
BRS
Jagga Reddy
Congress
  • Loading...

More Telugu News