keedaa cola: నవంబర్‌లో ‘కీడా కోలా’ కోలాహలం

keedaa cola to release on november 3rd

  • తరుణ్ భాస్కర్ దర్శత్వంలో వస్తున్న చిత్రం
  • సమర్పకుడిగా దగ్గుబాటి రానా
  • నవంబర్ 3న విడుదల కానున్న చిత్రం

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కొంత గ్యాప్ తర్వాత తను మళ్లీ మెగా ఫోన్ పట్టి తీస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఇందులో తను కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.  వేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన పోస్టర్లతో ఎనిమిది పాత్రలను పరిచయం చేసిన చిత్ర బృందం టీజర్‌‌తో కూడా ఆసక్తిని పెంచింది. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు సహా ఇతర నటులంతా సీరియస్ లుక్‌లో కనిపించారు. సినిమాలో తరుణ్ భాస్కర్ లోకల్ డాన్‌గా  కీలకపాత్ర పోషించాడు.

keedaa cola
Tollywood
tarun bhaskar
Rana Daggubati
  • Loading...

More Telugu News