Gujarat: జానపద గాయకురాలు ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం... వీడియో ఇదిగో!

Gujarati folk singer showered with bucketful of cash in viral video

  • కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా సంగీత కచేరీ
  • ఊర్వశి రాధాదియా గాత్రానికి ముగ్ధులైన అభిమానులు
  • ఆమె పాడుతున్నంతసేపు కరెన్సీని వెదజల్లిన అభిమానులు

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు ఊర్వశి రాధాదియాపై నోట్ల వర్షం కురిసింది. వేదికపై ఆమె తన బృందంతో కలిసి పాడుతున్నంతసేపు అభిమానులు కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కరెన్సీ నోట్ల వర్షం కురవడంతో ఆమె చుట్టుపక్కల మొత్తం నోట్లతో నిండిపోయింది. అయితే ఆమె ఈ కార్యక్రమాన్ని ఓ మంచి పని కోసం చేశారు.

కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా స్థానికంగా సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురువారం జరిగింది. ఆమె గాత్రానికి మంత్రముగ్ధులైన అభిమానులు అదేపనిగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News