KCR: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా నుంచి స్కూల్లో ఫలహారం

Government to launch breakfast scheme in Telangana

  • దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 24న ప్రారంభించనున్న కేసీఆర్
  • తల్లిదండ్రులు పడే ఇబ్బందుల దృష్ట్యా కూడా పథకం తీసుకొస్తున్న ప్రభుత్వం
  • కేసీఆర్ నిర్ణయం మేరకు ఉత్తర్వుల జారీ 

తెలంగాణ స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 24వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందించనుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఈ అల్పాహారం అందిస్తారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజున ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయమే వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పథకాన్ని తీసుకు వస్తున్నారు. కేసీఆర్‌ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

KCR
scheme
Telangana
  • Loading...

More Telugu News