drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసు: ఏ29 నిందితుడైన నటుడు నవదీప్‌కు త్వరలో నోటీసులు?

Police to send notices to Actor Navdeep

  • నవదీప్ పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
  • నవదీప్, మోడల్ శ్వేత సహా పరారీలో పదిహేడు మంది
  • అరెస్ట్ చేసిన 8 మంది నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ముగ్గురు నైజీరియన్లు సహా ఎనిమిది మందిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అగస్ట్ 31న వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళీ ఇచ్చిన సమాచారం ఆధారంగా మెహిదీపట్నం బస్టాప్‌లో ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. వారి నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు పోలీసు రిమాండ్ రిపోర్టులో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నవదీప్‌తో పాటు మోడల్ శ్వేత సహా పదిహేడు మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నవదీప్‌ను ఏ29 నిందితుడిగా పేర్కొన్నారు. అతనికి ఈ రోజు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. డ్రగ్స్ కేసులో ఓ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

drugs
navadeep
Tollywood
  • Loading...

More Telugu News