Manchu Lakshmi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మంచు లక్ష్మి ట్వీట్

Manchu Laxmi tweet on AP politics

  • ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు లక్ష్మి
  • వావ్.. ఏపీ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని వ్యాఖ్య
  • మంచు లక్ష్మి ట్వీట్‌పై భిన్నంగా స్పందిస్తోన్న నెటిజన్లు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలపై యాక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి స్పందించారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె ఏపీ రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'వావ్ ఏపీ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి' అని ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి ట్వీట్‌పై నెటిజన్లు కొంతమంది సానుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా స్పందించారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశాక, రిమాండ్ ఇవ్వడంతో రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉంచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న జైల్లో ఆయనతో ములాఖత్ అయి, టీడీపీ, జనసేనపై పొత్తు ప్రకటన చేశారు. మరోవైపు, చంద్రబాబు అవినీతి చేసినట్లుగా ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చేసినట్లు వైసీపీ చెబుతోంది.

Manchu Lakshmi
Mohan Babu
Chandrababu

More Telugu News