Honor 90: మూడేళ్ల తర్వాత తిరిగొచ్చిన 'ఆనర్'.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ విడుదల
- ఆనర్ 90 పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశం
- రెండు వేరియంట్లలో ఇది లభ్యం
- వీటి ధరలు రూ.37,999 నుంచి మొదలు
- ఆఫర్లో భాగంగా రూ.27,999కే సొంతం చేసుకునే అవకాశం
చైనాకు చెందిన హువావే బ్రాండ్ ‘ఆనర్’ గుర్తుందా? భారత మార్కెట్లో ఈ బ్రాండ్ పై స్మార్ట్ ఫోన్లు మూడేళ్ల నుంచి కనిపించడం లేదు. ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత మార్కెట్లోకి ఈ సంస్థ అడుగు పెట్టింది. ఆనర్ 90 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఎన్నో ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ను ప్రీమియం రేంజ్ లో తీసుకొచ్చింది. ధర రూ.37,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- ఈ ఫోన్ 7.8ఎంఎం మందంతో స్లీక్ గా ఉంటుంది. 6.7 అంగుళాల క్వాడ్ కర్వ్ డ్ అమోలెడ్ డిస్ ప్లేతో, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో, 1,600 నిట్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. కర్వ్ డ్ డిస్ ప్లే కావడంతో అంచు చివరి వరకు డిస్ ప్లే ఉంటుంది.
- ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్ సెట్ వాడారు. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కు సైతం అనుకూలంగా ఉంటుంది.
- ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ చార్జర్ తో చాలా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.
- 200 మెగాపిక్సల్ అల్ట్రా క్లియర్ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. అలాగే, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఏర్పాటు చేశారు. 4కే వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇది కూడా 4కే వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
- ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ల విక్రయాలు మొదలవుతాయి.
- 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.37,999. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.39,999. కాకపోతే ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా వీటిని రూ.27,999, రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు.