Deepika Padukone: 'జవాన్' కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేసిన దీపిక

Deepika Padukone says she didnot charge anything for Jawan

  • షారూక్ ఖాన్ కి, తనకి మధ్య నమ్మకం, గౌరవం ఉన్నట్టు వెల్లడి
  • జవాన్ సక్సెస్ కావడం పట్ల సంతోషం
  • అతిథి పాత్రల కోసం తాను పారితోషికం తీసుకోలేదని ప్రకటన

జవాన్ సినిమా మంచి విజయం నమోదు చేయడంతో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన దీపిక పదుకొణె షారూక్ ఖాన్ తో తన అనుబంధంపై స్పందించింది. తాము ఒకరికొకరు అదృష్టవంతులమని వ్యాఖ్యానించింది. ద వీక్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీపిక పలు అంశాలపై మాట్లాడింది. తమ మధ్య ఎంతో నమ్మకం, గౌరవం ఉన్నట్టు చెప్పింది. తాము ఒకరికొకరం లక్కీ చార్మ్ అంటూ, నిజం చెప్పాలంటే అదృష్టం కంటే ఎక్కువని పేర్కొంది. 

బాలీవుడ్ లో ఈ జంట పలు సినిమాల్లో కలసి పనిచేసింది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన పఠాన్ లోనూ షారూక్ ఖాన్ తో దీపిక కనిపించింది. జవాన్ సినిమాలో దీపిక పోషించిన అతిథి పాత్రకు ఇప్పుడు ప్రశంసలు లభిస్తున్నాయి. 2007లో ఓమ్ శాంతి ఓమ్ సినిమాలో తొలిసారిగా షారూక్ ఖాన్ తో తెరను పంచుకోగా, ఆమెకు బాలీవుడ్ లో అదే తొలి సినిమా. ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రాల్లోనూ కలసి నటించారు. వీరు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించినవే. 

జవాన్ సక్సెస్ పై దీపిక మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కూడా గణాంకాలకు ఆకర్షితులు కానని పేర్కొంది. సినిమాలు మళ్లీ మళ్లీ రావాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పింది. తాను జవాన్ కానీ, మరో సినిమా కానీ అతిథి పాత్రలకు ఎలాంటి చార్జీ తీసుకోలేదని తెలిపింది. షారూక్ ఖాన్ సినిమాల్లో ఎలాంటి అతిథి పాత్రలైనా తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించింది.

Deepika Padukone
Jawan
remunaration
  • Loading...

More Telugu News