Puvvada Ajay Kumar: తెలంగాణలో కూడా ఇంతటి కక్షపూరిత రాజకీయాలు లేవు... చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి పువ్వాడ స్పందన

Telangana minister Puvvada responds on Chandrababu arrest
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్న మంత్రి పువ్వాడ
  • దీన్ని ఖండిస్తున్నట్టు వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, దీన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్ట్ సరికాదని అన్నారు. 

'ప్రజావసరాల కోసం ముఖ్యమంత్రులు అనేక నిర్ణయాలు తీసుకుంటారు... రాజకీయాలు రావొచ్చు, పోవచ్చు... కానీ  ఈ విధంగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం మాత్రం సమంజసం కాదు' అని పువ్వాడ స్పష్టం చేశారు. ఇంతటి కక్షపూరిత రాజకీయాలు తెలంగాణలో కూడా లేవని వివరించారు. నిన్న తమ నేత సండ్ర వెంకటవీరయ్య కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారని మంత్రి పువ్వాడ వెల్లడించారు.
Puvvada Ajay Kumar
Chandrababu
Arrest
BRS
TDP
Telangana

More Telugu News