hansika: హన్సిక డిజిటల్‌ ఎంట్రీ

Hansia makes digital debut

  • ఎం.వై.3 వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌గా హన్సిక 
  • రోబో పాత్రలో కనిపించనున్న నటి
  • రేపటి నుంచి హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్‌

పెళ్లయినప్పటికీ కెరీర్‌‌ను కొనసాగిస్తున్న హన్సిక హీరోయిన్‌గా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఆమె కీలక పాత్రలో ‘ఎమ్‌.వై.3’ అనే వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. మూగెన్ రావు హీరోగా న‌టిస్తున్న ఈ సిరీస్‌కు రాజేష్‌. ఎం దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి స్ట్రీమ్ కానున్న ఈ సిరీస్‌లో హన్సికతో పాటు శంత‌ను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిన్న ట్రైలర్ విడుదలైంది. ఇదొక సైంటిఫిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా, మనిషిగా హన్సిక రెండు పాత్రలు పోషించింది. రోబోగా హ‌న్సిక లుక్‌, మ్యాన‌రిజ‌ం ఆకట్టుకుంటోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. 

hansika
digital
hotstar
web series

More Telugu News