Neha Shetty: యూత్ ను కట్టిపడేస్తున్న నేహా శెట్టి!

Neha Shetty Special

  • 'మెహబూబా'తో ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి
  • గ్లామర్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు  
  • కెరియర్ ను మలుపు తిప్పిన 'డీజే టిల్లు'
  • విడుదలకు సిద్ధమైన రెండు సినిమాలు

కొంతమంది హీరోయిన్స్ ఫస్టు సినిమాతోనే భారీ హిట్ కొట్టేసి, ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ రాక నానా పాట్లు పడుతూ ఉంటారు. మరికొంతమంది హీరోయిన్స్ కి ఫస్టు సినిమాతో ఫ్లాప్ ఎదురైనప్పటికీ, ఆ తరువాత నెమ్మదిగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు వెళుతుంటారు. అలాంటివారి జాబితాలో 'నేహా శెట్టి' ఒకరు. 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు తెరకి పరిచయమైంది. ఆకాశ్ పూరి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. పొలోమంటూ వాళ్ల హృదయాలను కాజేసింది. ఆ తరువాత చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. ఇక ఆ తరువాత చేసిన 'డీజే టిల్లు' ఆమె కెరియర్ ను మలుపు తిప్పేసింది. ఆ సినిమాలో రాధిక పాత్రలో ఆమె ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. రీసెంటుగా చేసిన 'బెదురులంక 2012' సినిమా కూడా ఫరవాలేదనిపించుకుంది. కిరణ్ అబ్బవరం జోడీగా చేసిన 'రూల్స్ రంజన్' .. విష్వక్ సేన్ సరసన చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతో నేహా శెట్టి జోరు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News