Tollywood: 'ఆపరేషన్ వాలెంటైన్'కు డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్ తేజ్

- శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
- హీరోయిన్‌గా మానుషి చిల్లార్
- డిసెంబర్ 8న హిందీ, తెలుగు భాషల్లో విడుదల
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’పై భారీ అశలు పెట్టుకున్నాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.
