Sai Pallavi: ఆమిర్ ఖాన్ తనయుడి జోడీగా సాయిపల్లవి?

Sai Pallavi Special

  • హీరోగా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ 
  • దర్శకత్వం వహిస్తున్న సునీల్ పాండే 
  • సాయిపల్లవిని ఎంపిక చేశారంటూ టాక్ 
  • ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ  

సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఏ భాషలోనైనా తనకి నచ్చిన కథలను .. పాత్రలను చేయడమే సాయిపల్లవికి అలవాటు. తనకి కథ నచ్చితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది .. నచ్చే కథ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంది. అందువలన సహజంగానే కాస్త గ్యాప్ వస్తూ ఉంటుంది. 

తెలుగులో 'విరాటపర్వం' తరువాత ఆమెకి అలాంటి గ్యాప్ నే వచ్చింది. తెలుగు నుంచి సాయిపల్లవికి నచ్చే కథ వెళ్లకపోవడంతో, ఆమె తమిళంలో ఒక సినిమా చేస్తోంది. శివ కార్తికేయన్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. ప్రస్తుతం షూటింగు దశలో ఈ సినిమా ఉంది. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది. 

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా దర్శకుడు సునీల్ పాండే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సాయిపల్లవికి ఇది ఫస్టు బాలీవుడ్ సినిమా అవుతుంది. సాయిపల్లవి నటనకి .. డాన్స్ కి అక్కడి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

Sai Pallavi
Actress
Bollywood
  • Loading...

More Telugu News