Cyber Crime: చిరు వ్యాపారికి వలపు వల.. నగ్నంగా మార్చి లక్షన్నర స్వాహా

Woman cheats man by WhatsApp call

  • హైదరాబాద్‌లో ఘటన
  • ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన యువతి
  • వీడియో కాల్‌లో నగ్నంగా మార్చి బ్లాక్‌మెయిల్

చిరు వ్యాపారికి వలపు వల విసిరిన ఓ యువతి అతడిని నిండా ముంచింది. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షన్నర రూపాయలు కొట్టేసింది. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి (32)కి ఫేస్‌బుక్‌లో ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దానిని అతడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. రోజూ ఫోన్లు చేసుకుని కబుర్లు చెప్పుకునేవారు.

ఒకసారి వాట్సాప్‌లో వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అతడిని నగ్నంగా మారమని కోరడంతో అతడు అదే పనిచేసి ఆమె చేతికి చిక్కాడు. ఆ వీడియోను రికార్డు చేసిన ఆమె దానిని చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను బయటపెడతానని బెదిరించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో అతడు విడతల వారీగా రూ. 1.53 లక్షలు సమర్పించుకున్నాడు. అయినా, ఇంకా డబ్బుల కోసం బెదిరిస్తుండడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Crime
Social Media
WhatsApp Call

More Telugu News