Pawan Kalyan: రేపు చంద్రబాబుతో ములాఖత్: పవన్ కల్యాణ్‌తో పాటు బాలకృష్ణ, లోకేశ్

Pawan lokesh and Balakrishna to meet chandrababu
  • రేపు మధ్యాహ్నం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్
  • రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రాజమండ్రికి జనసేనాని
  • భువనేశ్వరిని పరామర్శించనున్న పవన్ కల్యాణ్
రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కలవనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటనను విడుదల చేసింది. పవన్ గురువారం రాజమండ్రి వెళ్తున్నారని, అక్కడి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబును కలుస్తారని, ములాఖత్ సమయంలో ఈ భేటీ ఉంటుందని పేర్కొంది. పవన్ రేపు ఉదయం గం.9.30కు రాజమండ్రి చేరుకొని, తొలుత చంద్రబాబు కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు. భువనేశ్వరిని పరామర్శిస్తారు.

ఆ తర్వాత ఇద్దరు టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును ములాఖత్ సమయంలో కలుస్తారు. మధ్యాహ్నం గం.12. సమయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి పవన్ టీడీపీ అధినేతను కలవనున్నారు. ములాఖత్ ఖరారైనట్లు టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి.
Pawan Kalyan
Nara Lokesh
Balakrishna
Chandrababu

More Telugu News