Nagarjuna: అత్తగారితో నాగార్జున ఫొటో... సోషల్ మీడియాలో సందడి

- అమల తల్లి ఐర్లాండ్ మహిళ
- బెంగాల్ కు చెందిన నేవీ ఆఫీసర్ తో ప్రేమ వివాహం
- హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఉద్యోగాలు చేసిన నాగ్ అత్తగారు
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు చెందిన ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోలో నాగార్జున, అమల, అఖిల్ తో పాటు మరో మహిళ కూడా ఉన్నారు. ఆమె అమల తల్లి!
అమల తల్లి ఐర్లాండ్ మహిళ. ఆమె బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమల తల్లి భారత్ లో హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఉద్యోగాలు చేశారు. ఉద్యోగ రీత్యా అమల తల్లిదండ్రులు వైజాగ్, చైన్నైలోనూ కొంతకాలం పాటు ఉన్నారు. నాగార్జున, అమలది కూడా ప్రేమ వివాహం అని తెలిసిందే. ఇక, ప్రస్తుత విషయానికొస్తే... అత్తగారితో నాగ్ ఫొటోను అభిమానులు విపరీతంగా లైక్ చేస్తున్నారు.
నాగార్జున తాజాగా కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకత్వంలో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమా 2024 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాతోనూ నాగ్ మరో చిత్రం చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఘోస్ట్ పరాజయం తర్వాత నాగ్ కథలపై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది.
