uday kumar reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్!

Uday Kumar Reddy gets escort bail

  • ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ న్యాయస్థానం
  • ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో బెయిల్ మంజూరు
  • రాకపోకలకు అయ్యే ఖర్చును ఉదయ్ కుమార్ భరించాలని ఆదేశాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో అనుమతించింది. ఈ మేరకు రాకపోకలకు అయ్యే ఖర్చును కూడా ఉదయ్ కుమార్ రెడ్డి భరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో ఈ నెల 11వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. తన భార్య గర్భవతిగా ఉండటంతో పదిహేను రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు, బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 11న తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసింది.

uday kumar reddy
YS Vivekananda Reddy
Andhra Pradesh
  • Loading...

More Telugu News