Vishal: ఓ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో విశాల్

Hero Vishal fires on director Mysskin

  • గతంలో మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటించిన విశాల్
  • తెలుగులో డిటెక్టివ్ పేరుతో విడుదలైన చిత్రం
  • ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన విశాల్
  • తుప్పరివాలన్ సీక్వెల్ తీద్దామనుకున్నాక మిస్కిన్ ఇబ్బందిపెట్టాడన్న విశాల్

తమిళ హీరో విశాల్ నటించిన కొత్త చిత్రం 'మార్క్ ఆంటోని' సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో విశాల్ బిజీగా ఉన్నారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో తాను నటించిన 'తుప్పరివాలన్' చిత్ర దర్శకుడు మిస్కిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిస్కిన్ తనను తీవ్ర వేదనకు గురిచేశాడని, అతడు పెట్టిన  బాధలకు ఇంకొకరైతే చనిపోయేవారని వెల్లడించారు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరించానని, కానీ తుప్పరివాలన్-2 తెరకెక్కించాలని భావించిన తర్వాత మిస్కిన్ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని విశాల్ వాపోయారు. 

తన స్థానంలో ఎవరైనా పెద్ద వయసున్న నిర్మాత ఉండుంటే హార్ట్ అటాక్ తో చచ్చిపోయేవారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో లండన్ లో ప్లాట్ ఫారంపై కూర్చుని ఒంటరిగా ఎంతో బాధపడ్డానని విశాల్ గుర్తు చేసుకున్నారు. 

మరోసారి మిస్కిన్ తో కలిసి పనిచేయబోనని స్పష్టం చేశారు. మిస్కిన్ తో కలిసి తుప్పరివాలన్-2 తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది పూర్తికాదని అన్నారు. 2024లో తానే సొంతంగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని తుప్పరివాలన్-2 తెరకెక్కిస్తానని విశాల్ తెలిపారు.

Vishal
Mysskin
Thupparivaalan
Director
Kollywood
  • Loading...

More Telugu News