Prabhas: 'సలార్' ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ .. డీల్ మామూలుగా లేదే!

Salaar Movie Update

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్'
  • ఆయన జోడీ కడుతున్న శ్రుతి హాసన్ 
  • 185 కోట్లతో స్ట్రీమింగ్ హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్? 
  • కీలకమైన పాత్రల్లో జగపతిబాబు - పృథ్వీరాజ్ సుకుమారన్   

ప్రభాస్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాలలో 'సలార్' ఒకటి. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. 

ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో .. సోనీ లివ్ .. నెట్ ఫ్లిక్స్ వారు పోటీపడినట్టుగా చెబుతున్నారు. చివరికి నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు 185 కోట్లను చెల్లించినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ కి గల మార్కెట్ .. ప్రశాంత్ నీల్ కి గల ఇమేజ్ .. హోంబలే బ్యానర్ వ్యాల్యూ ఇందుకు కారణమని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలను పోషించారు.

Prabhas
Sruthi Haasan
Jagapathi Babu
Salaar
  • Loading...

More Telugu News