Vaishnavi Chaitanya: 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'బేబి' హీరోయిన్!

Baby in Bommarillu Bhaskar Movie

  • 'బేబి' సినిమాతో పాప్యులర్ అయిన వైష్ణవి 
  • సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా కొత్త సినిమా 
  • 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా
  • నిర్మాతగా బీవీఎస్ ఎన్ ప్రసాద్

ఈ ఏడాది వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసిన చిన్న సినిమాలలో 'బేబి' ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన 'వైష్ణవి చైతన్య' గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో యూత్ లో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఇన్ని రోజులైనా ఈ సినిమాను గురించి యూత్ ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది.

వైష్ణవికి ఇక వరుస అవకాశాలు రావడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. యంగ్ హీరోల జోడీగా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుందనే టాక్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. తాజాగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ప్రాజెక్టు విషయంలోను ఆమె పేరు తెరపైకి వచ్చింది. 

'డీజే టిల్లు' హీరో సిద్ధూ జొన్నలగడ్డతో 'బొమ్మరిల్లు' భాస్కర్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం వైష్ణవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా నుంచి, త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. 

Vaishnavi Chaitanya
Siddhu Jonnalagadda
Bommarillu Bhaskar
  • Loading...

More Telugu News