Venu Thottempudi: ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన అందమైన ఆ యువతి దెయ్యమేనా? .. 'అతిథి' హాట్ స్టార్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Venu Thottempudi Athithi

  • హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి 'అతిథి'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • వేణు తొట్టెంపూడి ఫస్టు వెబ్ సిరీస్ 
  • ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కూడా ఇప్పుడు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే సస్పెన్స్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లను అందించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నాయి. 

అలా హాట్ స్టార్ ట్రాక్ పైకి మరో హారర్ థ్రిల్లర్ అడుగుపెట్టనుంది .. ఆ వెబ్ సిరీస్ పేరే 'అతిథి'. రాండమ్ ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి, భరత్ దర్శకత్వం వహించాడు. హీరో వేణు తొట్టెంపూడి నటించిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. ఆయన పాత్ర చుట్టూనే ఈ కథ తిరగనుంది. రైటర్ రవి  పాత్రలో వేణు కనిపించనున్న ఈ వెబ్ సిరీస్ లో, అవంతిక ముఖ్యమైన పాత్రను పోషించింది. 

కథ విషయానికి వస్తే .. దెయ్యాలు ఉన్నాయి .. అవి ఇతరులను ఆవహిస్తాయి అనే విషయాలను రవి ఎంత మాత్రం నమ్మడు. అలాంటి రవి ఇంటికి మనీషా అనే ఒక యువతి వస్తుంది. ఆమె ప్రవర్తన చాలా చిత్రంగా ఉండటంతో, ఆమె దెయ్యమని రవితో స్నేహితుడు చెబుతాడు. అప్పుడు రవి ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేవి ఆసక్తికర అంశాలు. ఈ నెల 19వ తేదీ నుంచి హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

Venu Thottempudi
Avanthika
Athidhi
Web Series
  • Loading...

More Telugu News