Nipah Virus: నీపా వైరస్‌‌ సోకి ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో కేరళకు కేంద్ర బృందం

2 deaths in kerala due to nipah virus center sends team for assistance

  • కోజీకోడ్ జిల్లాలో నీపా వైరస్ బారిన పడి  ఇద్దరు  మరణించినట్టు నిర్ధారణ
  • మరో ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స
  • రాష్ట్రంలో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర బృందం
  • నీపా వైరస్ కట్టడి కోసం రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం 
  • కంట్రోల్ రూం ఏర్పాటు, మాస్కులు ధరించాలంటూ ప్రజలకు సూచన

కేరళలో నిపా వైరస్ కలకలం మొదలైంది. ఇటీవల కోజీకోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తుల మరణానికి నీపా వైరస్ కారణమని కేంద్రం తాజాగా నిర్ధారించింది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన మరో ఇద్దరు పడ్డట్టు కూడా తేల్చింది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు. 

నీపా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. ‘‘రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. 

నీపాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News