Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ మరో ఘనత

Rohit Sharma crosses ten thousand runs in ODI format

  • ఇవాళ శ్రీలంకతో టీమిండియా పోరు
  • వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న రోహిత్ శర్మ
  • ఓవరాల్ గా 15వ స్థానంలో టీమిండియా కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇవాళ శ్రీలంకతో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో 10 వేలకు పైబడి పరుగులు సాధించినవారి జాబితాలో రోహిత్ శర్మ 15వ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (13,024), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రావిడ్ (10,889), మహేంద్ర సింగ్  ధోనీ (10,773) కూడా భారత్ తరఫున 10 వేల పరుగుల క్లబ్ లో ఉన్నారు. 

వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్ లో ఉన్నది వీరే...

1. సచిన్ టెండూల్కర్- 463 మ్యాచ్ ల్లో 18,426 పరుగులు
2.కుమార్ సంగక్కర- 404 మ్యాచ్ ల్లో 14,234 పరుగులు
3. రికీ పాంటింగ్- 375 మ్యాచ్ ల్లో 13,704 పరుగులు
4. సనత్ జయసూర్య- 445 మ్యాచ్ ల్లో 13,430 పరుగులు
5. విరాట్  కోహ్లీ- 279 మ్యాచ్ ల్లో 13,024* పరుగులు
6. మహేల జయవర్ధనే- 448 మ్యాచ్ ల్లో 12,650 పరుగులు
7. ఇంజమామ్ ఉల్ హక్- 378 మ్యాచ్ ల్లో 11,739 పరుగులు
8. జాక్ కలిస్- 328 మ్యాచ్ ల్లో 11,579 పరుగులు
9. సౌరవ్ గంగూలీ- 311 మ్యాచ్ ల్లో 11,363 పరుగులు
10. రాహుల్ ద్రావిడ్- 344 మ్యాచ్ ల్లో 10,889 పరుగులు
11. మహేంద్ర సింగ్ ధోనీ- 350 మ్యాచ్ ల్లో 10,773 పరుగులు
12. క్రిస్ గేల్- 301 మ్యాచ్ ల్లో 10,480 పరుగులు
13. బ్రియాన్ లారా- 299 మ్యాచ్ ల్లో 10,405 పరుగులు
14. తిలకరత్నే దిల్షాన్- 330 మ్యాచ్ ల్లో 10,290 పరుగులు
15. రోహిత్ శర్మ- 248 మ్యాచ్ ల్లో 10,025* పరుగులు

More Telugu News