Vishal: కోర్టులో విశాల్ గెలుపు.. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ‘మార్క్ ఆంటోని’ విడుదల

Mark Antony movie update

  • విశాల్ హీరోగా రూపొందిన 'మార్క్ ఆంటోని'
  • ఆయన సరసన మెరవనున్న రీతూ వర్మ
  • ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జె. సూర్య  
  • సంగీతాన్ని సమకూర్చిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • ఈ నెల 15వ తేదీన సినిమా విడుదల

హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. 'మార్క్ ఆంటోని' విడుదల మీద మద్రాస్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ కేసులో విశాల్ కి అనుకూలంగా  తీర్పు లభించింది. దీంతో 'మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది' అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. 

 'మార్క్ ఆంటోని' విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. విశాల్ మార్క్ ఆంటోని చిత్రంలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో  నటించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. సునిల్, సెల్వ రాఘవన్, అభినయ, వై జి మహేంద్రన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. 'మార్క్ ఆంటోని' టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్న విశాల్ కి ఈ సినిమా ఫలితం ఊరటనిస్తుందేమో చూడాలి.


Vishal
Ritu Varma
SJ Surya
Mark Antony
  • Loading...

More Telugu News