Raviteja: రవితేజ నిర్మాతగా చాంగురే బంగారురాజా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

Changure Bangaru Raja Trailer released

  • కార్తీక్ రత్నం హీరోగా వస్తున్న సినిమా
  • హైలైట్‌గా సత్య, రవిబాబు కామెడీ
  • ఈ నెల 15న విడుదల కానున్న చిత్రం

హీరోగా వరుస చిత్రాలు చేస్తూనే మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా కూడా చిత్రాలు రూపొందిస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌజ్ నుంచి తాజాగా ‘చాంగురే బంగారురాజా’ వస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీక్ రత్నం హీరోగా నటించాడు. సత్య, రవిబాబు కీలక పాత్ర పోషించారు. సతీష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ఈవెంట్‌ కు రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 

ఒక గ్రామంలో వజ్రాలు దొరకడంతో అందరూ వాటిని వెతికేందుకు ప్రజలంతా పొలాల్లోకి వెళ్లడం, వాటికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని హడావిడి చేయడంతో ట్రైలర్ మొదలైంది. హీరో కార్తీక్ లేడీ కానిస్టేబుల్ పాత్రలోని హీరోయిన్‌తో ప్రేమాయణం నడపడం వారి ప్రేమలో ట్విస్టులు, సత్య, రవిబాబు కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా ఉండనున్నాయి. ఈ సినిమా ఈనెల 15న విడుదల కాబోతోంది.

Raviteja
producer
Changure Bangaru Raja
trailer

More Telugu News