Anushka Sharma: సూపర్ గై అంటూ కోహ్లీని మెచ్చుకున్న అనుష్క శర్మ

Anushka Sharma Athiya Shetty react to Virat Kohli and KL Rahul centuries during India vs Pakistan Asia Cup 2023

  • కేఎల్ రాహుల్ కు సైతం అభినందనలు
  • రాహుల్, కోహ్లీ ఫొటోలను షేర్ చేసిన అతియా శెట్టి
  • ఛాంపియన్స్ అంటూ మెచ్చుకోలు
  • చీకటి ముగుస్తుంది.. సూర్యుడు ఉదయిస్తాడంటూ కొటేషన్

పాకిస్థాన్ పై భారత్ ఘన విజయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చాలా కీలకంగా వ్యవహరించారు. చక్కని సమన్వయంతో చెరో సెంచరీ బాదేసి పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. తదుపరి భారత్ బౌలింగ్ లోనూ సత్తా చాటడంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. దీంతో సెంచరీలు చేసిన కోహ్లీ, రాహుల్ పై అభినందనల వర్షం కురుస్తోంది. కోహ్లీని అనుష్క శర్మ, రాహుల్ ను అతియా శెట్టి, మామ సునీల్ శెట్టి మెచ్చుకున్నారు.

అనుష్క శర్మ ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీస్ లో స్పందిస్తూ.. ‘‘సూపర్ నాక్.. సూపర్ గై’’ అంటూ భర్త కోహ్లీని పొగిడేసింది. పనిలో పనిగా తన భర్తతో సమానంగా సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ను కూడా అభినందించింది. ‘‘కంగ్రాష్యులేషన్స్ రాహుల్’’ అంటూ పేర్కొంది. అటు కేఎల్ రాహుల్ జీవిత భాగస్వామి, నటి అతియా శెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో.. మైదానంలో రాహుల్ సెంచరీ తర్వాత అభివందనం చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. కోహ్లీ, రాహుల్ తో కూడిన ఫొటోను షేర్ చేస్తూ ఛాంపియన్స్ అని కొటేషన్ పెట్టింది. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి సైతం రాహుల్ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ లోనూ షేర్ చేశారు.  ‘‘చీకటి రాత్రి కూడా ముగుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. నాకు అన్నీ నీవే. లవ్ యూ’’ అని అతియా పేర్కొంది. 

More Telugu News