VH: చంద్రబాబు అరెస్ట్ సరైన చర్యగా అనిపించడంలేదు: వీహెచ్

VH opines on Chandrababu arrest

  • స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
  • ప్రతీకార రాజకీయాలు గతంలో లేవన్న వీహెచ్
  • మోదీ, అమిత్ షా మొదలుపెట్టిన రాజకీయాలను జగన్ కొనసాగిస్తున్నాడని వ్యాఖ్య  

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ సరైన చర్యగా అనిపించడంలేదని అన్నారు. ప్రతీకార రాజకీయాలు గతంలో లేవని తెలిపారు. జగన్ వచ్చాకే రాజకీయాలు భ్రష్టుపట్టాయని వీహెచ్ విమర్శించారు. 

కక్ష సాధింపు చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదలుపెట్టిన రాజకీయాలను జగన్ కొనసాగిస్తున్నట్టుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇలా విపక్ష నేతలను ఇబ్బందిపెట్టిన దాఖలాలు లేవని వీహెచ్ స్పష్టం చేశారు.

VH
Chandrababu
Arrest
Jagan
Congress
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News