Mark Antoni: ‘మార్క్ ఆంటోని’​ ​ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది: హీరో విశాల్

Hero Vishal talks about his new movie Mark Antoni

  • విశాల్, రీతూ వర్మ జంటగా మార్క్ ఆంటోని
  • అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చిత్రం
  • సెప్టెంబరు 15న రిలీజ్
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్

విశాల్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ నటుడు ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషించాడు. జన్మతః మూగ చెవిటి నటి అభినయ... విశాల్ భార్యగా కనిపించనున్నారు. 

ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 

ఈ కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ క్రేజీగా ఉన్నాయని తెలిపారు. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారు. "అధిక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య గారు నటుడిగా, దర్శకుడిగా నాకు చాలా ఇష్టం. అభినయ ఎంతో మందికి స్పూర్తి. ఆమె నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. సునీల్ అన్న ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తుంటారు. విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించే సినిమాలన్నీ హిట్ అవ్వాలని అనుకుంటాను. ఈ మూవీతో ఆయన మరో స్థాయికి వెళ్లాలి. సెప్టెంబర్ 15న రాబోతోన్న మార్క్ ఆంటోని పెద్ద హిట్ కాబోతోంది" అని అన్నారు. 

హీరో విశాల్ మాట్లాడుతూ... "నాకు ఈ రాష్ట్రంలో నితిన్ తమ్ముడిలాంటి వాడు. రానా, నితిన్‌లతోనే నేను ఎక్కువగా ఉంటాను. నితిన్ నాకు దొరకడం గిఫ్ట్. గెస్టుగా పిలిచా, కానీ నేను టైం ఇవ్వకపోయినా... నాకోసం వచ్చాడు. నితిన్ సక్సెస్ గ్రాఫ్ చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ ఈవెంట్‌కు నితిన్ రావడం హ్యాపీగా ఉంది. నిర్మాత వినోద్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం.  

మా ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తరువాత చాలా మంది వద్దు అన్నారు. నేను ఎందుకు ఈ సినిమా చేశాను... ఎందుకు అంత నమ్మకం అన్నది సెప్టెంబర్ 15న అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాతో నాకు సూర్య, సునీల్ రూపంలో మంచి బ్రదర్స్ దొరికారు. టీం అంతా కలిసి కష్టపడటం వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. 

అభినయ ఎంతో మందికి స్ఫూర్తి. ఆమెకు సరిహద్దులనేవి లేవు. వేణు గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను తీసుకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్. మార్క్ ఆంటోని అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ పెట్టే డబ్బులకు న్యాయం జరుగుతుంది. రెండున్నర గంటలపాటు నవ్వుకునేలా సినిమా ఉంటుంది" అని అన్నారు.

More Telugu News