Rishi Sunak: మనసులు దోచేశావయ్యా సునాక్.. వైరల్ అవుతున్న ఫొటోగ్రాఫ్

Rishi Sunaks heart touching moment with Sheikh Hasina

  • జీ20 సమావేశాలకు భార్య అక్షతామూర్తితో కలిసి భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
  • కుర్చీలో కూర్చున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
  • మోకాళ్లపై కూర్చుని ఆమెతో ఆప్యాయంగా ముచ్చట్లాడిన సునాక్

భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజల మనసులు కొల్లగొట్టారు. కుర్చీలో కూర్చున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వద్ద మోకాళ్లపై కూర్చుని ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సునాక్‌ను పొగుడుతూ పలువురు యూజర్లు ఈ ఫొటోగ్రాఫ్‌ను ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు.
 
ఓ గొప్ప దేశానికి ప్రధాని అయినా ఈగోలేని వ్యక్తంటూ సునాక్‌ను పలువురు కొనియాడుతూ ఫొటోను రీట్వీట్ చేస్తున్నారు. ‘ఎంత ప్రేమ.. ఆప్యాయత’ అని మరొకరు కామెంట్ చేశారు. సునాక్ జెంటిల్మన్ అని ఇంకొకరు.. ఇలా ప్రతి ఒక్కరు సునాక్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, జీ20 సమావేశాలకు భార్య అక్షతామూర్తితో కలిసి భారత్ వచ్చిన సునాక్.. ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.

Rishi Sunak
Britain
Rish Sunak G20
Bangladesh
Sheikh Hasina
Rishi Sunak Heart Touching
  • Loading...

More Telugu News