Paritala Siddhartha: పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అరెస్ట్.. పీఎస్ కు తరలింపు

Paritala sunitha arrested and shifted to police station

  • వెంకటాపురం గ్రామంలో పరిటాల సునీత అరెస్ట్
  • రామగిరి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • నల్ల చొక్కా వేసుకుని నిరసన వ్యక్తం చేసిన పరిటాల శ్రీరామ్

టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్ట్ చేసి, రామగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం 4 గంటలకే సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె పోలీసు నిర్బంధాన్ని దాటుకుని బయటకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. తన తల్లిని అరెస్ట్ చేయడంతో పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. నల్ల చొక్కా వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Paritala Siddhartha
Paritala Sriram
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News