Sujana Chowdary: రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకానికి ఇది పరాకాష్ఠ: వైసీపీ ప్రభుత్వంపై సుజనా చౌదరి ఫైర్

Sujana Chowdary fires on YSRCP Govt

  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు
  • బాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అన్న సుజనా చౌదరి
  • రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక కేసులో జైలుకు పంపిస్తున్నారని మండిపాటు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోవైపు, చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అరెస్ట్ జరిగిన తీరు, తదనంతర పరిణామాలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక కేసులో జైలుకు పంపించాలన్న వైసీపీ ప్రభుత్వ వైఖరి గర్హనీయమని చెప్పారు. రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకానికి ఇది పరాకాష్ఠ అని అన్నారు. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు నిర్వహించుకుంటున్న సమయంలో మన రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని విమర్శించారు.

Sujana Chowdary
BJP
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News