Jaspreet Bumrah: తండ్రయిన బుమ్రాకు అనుకోని కానుక

Bumrah received a gift from Pakistan pacer Shaheen Afridi
  • ఇటీవల తండ్రయిన బుమ్రా
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య సంజన
  • ఆసియా కప్ మధ్యలో భారత్ వెళ్లొచ్చిన బుమ్రా
  • ఇవాళ మ్యాచ్ కు ముందు బుమ్రాకు గిఫ్ట్ ఇచ్చిన పాక్ బౌలర్ అఫ్రిది
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల తండ్రయిన సంగతి తెలిసిందే. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆసియా కప్ మధ్యలోనే బుమ్రా భారత్ వెళ్లి భార్యాబిడ్డలను చూసి మళ్లీ వచ్చి జట్టుతో కలిశాడు. ఇవాళ పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియాలో బుమ్రా కూడా ఉన్నాడు. 

ఈ సందర్భంగా బుమ్రాకు అనుకోని కానుక లభించింది. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిది... తండ్రయిన బుమ్రాకు ఓ గిఫ్టును బహూకరించాడు. బుమ్రాకు తన తరఫున, పాకిస్థాన్ జట్టు తరఫున శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Jaspreet Bumrah
Gift
Shaheen Afridi
Fatherhood
India
Pakistan
Asia Cup

More Telugu News