Chandrababu: చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్
- చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
- ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్
- చంద్రబాబును వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది.
మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.