Chandrababu: ఏపీలోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు... రేపు బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ

TDP calls for Bandh tomorrow

  • చంద్రబాబుకు రిమాండ్
  • చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం
  • 144 సెక్షన్ పై అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు
  • చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చామన్న అచ్చెన్న

స్కిల్ డెవలప్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులను  దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. 

ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రం అంతటా బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Chandrababu
Andhra Pradesh
144 Section
Bandh
TDP
  • Loading...

More Telugu News